పాఠశాలను సందర్శించిన జడ్పీ మాజీ చైర్మన్‌

నిజాంసాగర్‌, నవంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల కార్యాలయంలోని అటెండెన్సు రిజిస్టర్‌ పరిశీలించారు. పాఠశాలలో కావలసిన మౌలిక వసతుల గురించి ఇన్చార్జి హెచ్‌ఎం అమర్‌ సింగ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

ఆయన వెంట ఎంఈఓ దేవి సింగ్‌, పంచాయతీరాజ్‌ ఏఈ మారుతి, గున్కుల్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ వాజిద్‌ అలీ, నాయకులు కాశయ్య, విజయ్‌ కుమార్‌, మహేందర్‌, సాయిలు, తదితరులు ఉన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »