కామారెడ్డి, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొండల్ రెడ్డి (45) ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరం కావడంతో ధర్మారావు పేట్ గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డి వెంటనే స్పందించి మానవ దృక్పథంతో ముందుకు వచ్చి ప్లేట్‌లెట్స్ దానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్ తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాష్ లు మాట్లాడుతూ సమాజంలోని చాలామంది వ్యక్తులకు రక్తదానం పట్ల అనవసరమైన అపోహలు ఉన్నాయని రక్త దానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, ప్రతి 3 నెలలకోసారి రక్తదానం, 15 రోజులకు ఒకసారి ప్లేట్ లెట్స్ దానం చేయవచ్చునని, రక్తదానం చేసేవారికి గుండె జబ్బు, శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల వంటి సమస్యలను రాకుండా ఉండే అవకాశం ఉందని అన్నారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత సామల సంతోష్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కెబిసి బ్లడ్ సెంటర్ టెక్నీషియన్లు జీవన్, సంతోష్ పాల్గొన్నారు.