కామారెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగాపూర్ గ్రామానికి చెందిన పిల్లమారి ప్రవీణ్ కుమార్‌ను ఆటా (అవార్డు టీచర్స్ అసోసియేషన్) కామారెడ్డి జిల్లా శాఖ వారు ఘనంగా సన్మానించారు. ప్రవీణ్ కుమార్ చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్ఎస్ బాలురలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.
జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 2022 కు ఎన్నికైన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో ఇటీవల సెప్టెంబర్ 5, 2022 న రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన పిల్లమారి ప్రవీణ్ కుమార్ గారిని సన్మానించినట్టు అవార్డీ టీచర్స్ అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఈ సంవత్సరం 2022 గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా పి ప్రవీణ్ కుమార్ ఒక్కరే కావడం చాలా సంతోషించదగిన విషయమన్నారు.
కార్యక్రమంలో చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రామకృష్ణ, రాజ్యలక్ష్మిలను, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైన 51 మంది ఉపాధ్యాయులను సన్మానించినట్టు తెలిపారు.
కార్యక్రమంలో సాందీపని డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ హరిస్మరణ రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శంకర్, కామారెడ్డి జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్చార్జి అంబీర్ మనోహర్, గెజిటెడ్ హెడ్మాస్టర్ గంగ కిషన్, ఆట జిల్లా అధ్యక్షులు దొడ్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి మార బాల్‌రెడ్డి, జిల్లా కోశాధికారి హరి ప్రసాద్, జిల్లా ఆట కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.