రెంజల్, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సత్యగౌడ్ గత వారం రోజుల క్రితం విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ఆర్టిసి మిత్ర బృందం తరఫున రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని మృతుడి భార్య మాదవి కి అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆర్టీసీ మిత్రబృందం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.