నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ శివారులోని మాణిక్ బండార్ ఎక్స్ రోడ్డు వద్ద గల కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తనిఖీ చేశారు.
కేంద్రంలో మొత్తం 65 మంది అభ్యర్థులకు గాను 36 మంది పరీక్షకు హాజరయ్యారని, 29 మంది గైరుహాజర్ అయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.సెల్వకుమార్ రాజా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను, మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్ తదితరులు ఉన్నారు.