నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మౌలిక సదుపాయాల కల్పన పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, మిగిలిన తుదిదశ పనులను మరింత వేగవంతం చేయాలని గుత్తేదారుకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్, టీఎస్ఐఐసి మేనేజర్ దినేష్ తదితరులు ఉన్నారు.