కామారెడ్డి, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రివిటింగ్ స్టూడియోలో జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వేల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆసం శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి. ప్రివిటింగ్ స్టూడియోలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందని, ప్రతి మండలంలోని ఫోటో గ్రాఫర్స్ అందరు అసోసియేషన్‌లో మెంబర్ కావాలని కోరారు. సమావేశానికి జిల్లాలోని వివిధ మండలాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈనెల 18, 19, 20 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఎక్స్పో సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు ఫోటోగ్రాఫర్ మృతి చెందినట్లయితే ఆ కుటుంబానికి కుటుంబ భరోసా పథకం ద్వారా 15 రోజులలో ఒక్క లక్ష 35 వేల రూపాయలను ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోటో మరియు వీడియో రంగాన్ని ఆదుకోవాలని ప్రమాద బీమా వర్తించేలా చర్యలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు నవీన్, రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి ప్రభు, జిల్లా ప్రధాన కార్యదర్శి హరాలే సురేష్, జిల్లా కోశాధికారి భూపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్, వివిధ మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.