అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మనీష (25) గర్భిణీకి అత్యవసరంగా ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో తెలంగాణ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థి కాషాగౌడ్‌ సహకారంతో గంభీర్‌ పూర్‌ గ్రామానికి చెందిన సురేష్‌ తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని రక్తదానానికి యువతి యువకులు ముందుకు రావాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, 15 రోజులకోసారి ప్లేట్‌లెట్స్‌ దానం చేసి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు.

రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత సురేష్‌కి, సహకరించిన రక్తదాత కాశాగౌడ్‌కి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు జతేష్‌ వి పాటిల్‌, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది యేసు గౌడ్‌, చందన్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »