నిజామాబాద్, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్లో ప్లాట్ల విక్రయానికి సంబంధించి ఈ నెల 14న సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్లో ఉదయం 9 గంటల నుండి బహిరంగ వేలం నిర్వహించనున్న దృష్ట్యా సోమవారం రోజున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
తిరిగి ఈ నెల 21వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.