నిజామాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్‌లను,ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి చిన్న పిల్లలకు, ప్రజలకు సేవ చేస్తున్న అంగన్వాడీ టీచర్‌లను, వర్కర్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రిటైర్మెంట్లకు దగ్గరగా ఉన్న అంగన్వాడీ టీచర్‌లకు పది లక్షలు, ఆయాలకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని, జీతంలో సగభాగాన్ని పెన్షన్‌గా చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన టీచర్‌లకు, ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అర్హత కలిగిన టీచర్‌లకు, ఆయాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.