కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జరిగిన ధరణి ప్లాట్ల వేలం ద్వారా రూ.47.97 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 65 ప్లాట్లు, గృహాలకు వేలంపాట నిర్వహించారు.
ఏడు ప్లాట్లు విక్రయించినట్లు అధికారులు చెప్పారు. ఈనెల 18 వరకు వేలంపాట కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.