నిజామాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కాంగ్రెస్ భవన్ నందు భారతదేశ మొదటి ప్రధాని, భారతరత్న, డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ 133వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నెహ్రూ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని, దేశ స్వాతంత్ర పోరాటంలో ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు హరిత విప్లవం ద్వారా మన రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గానీ మన జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గానీ పునాదులు వేసి నిర్మించడం ద్వారానే దేశం, రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఉన్న పాలకులు కేంద్రంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం దేశ స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన నెహ్రూ విలువ ఇప్పటికీ తగ్గకపోవడంతో బిజెపి నాయకులు నెహ్రూ యొక్క కీర్తిని తగ్గించే విధంగా అబద్ధపు ప్రచారాలు చేయడమనేది వారి అజ్ఞానానికి నిదర్శనం అని, నెహ్రూ పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది ఆకాశంపై ఉమ్మివేసినట్టే అని, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పనిలో నెహ్రూ ఆలోచన విధానాలు ఉన్నాయని, కావున జిల్లా ప్రజలు నెహ్రూ ఆలోచనలను ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లినప్పుడే ఆయనకు ఘన నివాళులు అర్పించిన వాళ్లమవుతామని ఆయన అన్నారు.
కార్యక్రమంలో అర్బన్ ఇంచార్జ్ తాహిర్ బీన్ హందన్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా ఎన్‌ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పిసిసి మాజీ డెలిగేట్ ఈసా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతి రెడ్డి రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కూనీ పూర్ రాజారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు తంబాకు చంద్రకళ, పోల ఉష, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మలైకా బేగం, నగర మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఏజాజ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేశ మహేష్, సిరికొండ గంగారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు, ప్రమోద్, ముష్షు పటేల్, తదితరులు పాల్గొన్నారు.