నిజామాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర 50వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక దయానంద యోగా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో యువతుల విభాగంలో ప్రథమ నమ్రత, ద్వితీయ స్వరజ్ఞ, తృతీయగా శ్రీనిధి, యువకుల విభాగంలో ప్రథమ భూమేష్, ద్వితీయ రాజు, తృతీయగా శివ నిలిచారని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు.
ఉదయం పోటీలను ప్రారంభించిన శైలి బెల్లాల్ మాట్లాడుతూ యోగా మన నిత్యజీవితంలో భాగం కావాలని, విద్యార్థి దశ నుంచే మనం యోగాభ్యాసం చెయ్యాలని తద్వారా మన శరీరం, మనస్సు, ఆలోచనలు మన చేతుల్లో వుంటాయని అందుకే నెహ్రూ యువ కేంద్ర 50వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా యోగా పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా యోగమయ జీవనం వైపు యువతను నడిపించేందుకు నెహ్రూ యువ కేంద్ర తప్పకుండా కృషి చేస్తుందని పేర్కొన్నారు.
విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలను, యోగా పట్టాలను అందించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా సీనియర్ యోగాచార్యులు మాధవి, భూమాగౌడ్, రమ వ్యవహరించారు. కార్యక్రమంలో సీనియర్ యోగాచార్య యోగా రామచందర్, బాల శేఖర్, సంగీత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.