కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నచ్చిన ప్లాట్లు, గృహాలు రాకపోతే బుదవారం వేలంలో పాల్గొనవచ్చని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ధరణి టౌన్షిప్ వేలంపాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్లు, వివిధ దశలలో నిర్మాణం పూర్తయిన గృహాలకు ప్రత్యక్ష వేలం జరుగుతుందని తెలిపారు.
ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం 56 ప్లాట్లు, తొమ్మిది గృహాలకు వేలంపాట నిర్వహించారు.
9 ప్లాట్లు, రెండు గృహాలు విక్రయించగా రూ.1.63 కోట్ల ఆదాయం వచ్చిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. సమావేశంలో జోనల్ మేనేజర్ రామ్‌దాస్, ఏవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.