నిజామాబాద్, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు అర్హులైన వారందరికీ ప్రమోషన్ కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఇవ్వాలని ఎన్‌ఎంఆర్ కార్మికులకు 22 జీవో ప్రకారం ఆరునెలల సర్వీస్ పొడిగించి పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు.
మంగళవారం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాదులో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ చనిపోయిన మెడికల్ అన్ఫిట్ పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఏజెన్సీ ద్వారా నియమింపబడ్డ కార్మికులను జీవో 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.
ఏజెన్సీని రద్దుచేసి ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని, తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి. నర్సింగరావు, బి. మల్లేష్, సుజాత, చంద్రశేఖర్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.