నిజామాబాద్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంచెలంచెలుగా ఎదిగి నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్‌కు అర్జునా అవార్డు రావడం జిల్లా ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణకు గర్వకారణం అన్నారు. భవిష్యత్‌లో ప్రపంచ స్థాయిలో రాణించి దేశ కీర్తిని మరింతగా పెంచాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.