కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావానిపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. 30 మంది విద్యార్థుల పరిస్థితి చూసి 108 అంబులెన్స్ పిలిపించి విద్యార్థులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వైద్యుల ద్వారా తెలుసుకొని, తల్లిదండ్రులతో మాట్లాడారు.