కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల యువ సమ్మేళనం స్థానిక రాజారెడ్డి గార్డెన్‌లో గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య వక్తగా అఖిలభారత ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలె శ్యామ్ కుమార్ విచ్చేసి మాట్లాడారు. నిజాం దౌర్జన్యాలను, రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజానీకం అనుభవించిన కష్టాలను కన్నులకు కట్టినట్లుగా వివరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకి …
Read More »Daily Archives: November 17, 2022
ఘనంగా ముగిసిన వీరభద్ర ఉత్సవాలు
నిజాంసాగర్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరంలాగా ఈ యేడు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగిన వీరభద్ర స్వామి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల నుండి కొనసాగిన మహోత్సవాలు మొదటి రోజు పసుపు పెట్టు కార్యక్రమం, పందిరి వేసుట, రెండవ రోజు భద్రకాళి సమేత వీరభద్ర కళ్యాణం అనంతరం అన్నదానం భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. …
Read More »కిసాన్ మేళను సందర్శించిన కోటగిరి రైతులు
కోటగిరి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలంలోని రైతులు (ఆత్మ డివిజన్) వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జగిత్యాల జిల్లాలో కిసాన్ మేళాను సందర్శించారు. యాసంగి సాగులో 2022`23 సంవత్సరానికి వివిధ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం, వివిధ పంటలపై ఆశించు చీడపీడల నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారని తెలిపారు. వివిధ పంటలలో కొత్త రకాల సాగు గురించి …
Read More »పాఠశాల స్థలాన్ని కాపాడండి
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పి.డి.ఎస్.యు నగర కమిటీ ఆధ్వర్యంలో కాలూర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నగర కమిటీ అధ్యక్షులు ఎస్కే. ఆశుర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 1235/1 లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ కాలూరు స్థలాన్ని కబ్జా చేసే …
Read More »ఈ నెల 21 నుండి పోడు భూములపై గ్రామ సభలు
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పోడు భూముల పరిశీలన ప్రక్రియలో భాగంగా ఈ నెల 21 వ తేదీ నుండి హాబిటేషన్ల వారీగా గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోడు భూముల అంశంపై ఆర్దీవోలు, ఎఫ్‌డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ …
Read More »సిఎం గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా…
వర్ని, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి రెండవసారి అధికారులంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, డిసిసి ప్రధానకార్యదర్శి సురేష్ బాబా ఆందోళన వ్యక్తం …
Read More »పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంసాగర్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు హనుమంతు షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం పత్తి క్వింటాలుకు రూ. 9609 పైచిలుకు ఉందని తెలిపారు. రైతులు కష్టపడి పండిరచిన పంటను దళారుల వలలో పడకుండా నేరుగా మార్కెట్లో వచ్చి అమ్ముకోవాలని రైతులు లాభాల బాట పట్టాలని ఎమ్మెల్యే …
Read More »మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
రెంజల్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనఊరు మన ఎమ్మెల్యే రెండవ దఫా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బొర్గం, తాడ్ బిలోలి, మౌలాలి తాండా గ్రామాలలో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్ పాషా, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు హజీ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని పల్లెపల్లెకు వివరించేందుకు మన ఊరు మన …
Read More »జిల్లా అధికారులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను అంశాలపై ఆ శాఖ అధికారులచే ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ట్రెజరీ కార్యాలయం ఉప సంచాలకులు బి.కోటేశ్వరరావు ఒక …
Read More »కాల భైరవస్వామిని దర్శించుకున్న ఎంపి, ఎమ్మెల్యే
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి ఈసన్నపల్లి గ్రామాల్లోని కాల బైరవ స్వామి జన్మదిన వేడుకల్లో గురువారం ఎంపీ బిబిపాటిల్, ఎమ్మెల్యే సురేందర్ పాల్గొన్నారు. స్వామి వారి సన్నిధిలో అగ్గి గుండాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేశ్ ఇంటికి చేరుకుని గ్రామ సర్పంచ్‌కి, వారి పాలక వర్గానికి …
Read More »