కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 9 ప్లాట్లు, ఒక గృహం వేలం పాట ద్వారా విక్రయించగా రూ.1.14 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు.
గురువారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లకు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20 ఫ్లాట్లు, 45 గృహాలకు వేలంపాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ రామ్ దాస్, అధికారులు పాల్గొన్నారు.