కోటగిరి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలంలోని రైతులు (ఆత్మ డివిజన్) వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జగిత్యాల జిల్లాలో కిసాన్ మేళాను సందర్శించారు. యాసంగి సాగులో 2022`23 సంవత్సరానికి వివిధ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం, వివిధ పంటలపై ఆశించు చీడపీడల నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారని తెలిపారు.
వివిధ పంటలలో కొత్త రకాల సాగు గురించి రైతులతో చర్చ గోష్టి నిర్వహించారని, అలాగే మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కోటగిరి మండల రైతులు సందర్శించారు. కార్యక్రమంలో ఏఈఓ కొత్తపల్లి గౌస్, ఎత్తోండ సందీప్, రైతులు గుగులోత్ మోహన్, రవీందర్, అశోక్ రెడ్డి, ఆంజనేయులు, కోటగిరి అనిల్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.