కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆలయ సేవకులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని, రక్తదాత ఒక యూనిట్ రక్తదానం చేయడం వల్ల 20 రోజుల పాటు ఒక చిన్నారి ప్రాణాలను కాపాడిన వారవుతారన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు, రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.
రక్తదానం చేసేవారు 9492874006 కి సంప్రదించాలన్నారు. రక్తదాన శిబిరము విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తన ఆటో ద్వారా ప్రచారానికి ముందుకు వచ్చిన దోమకొండకు చెందిన తాహెర్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, రెడ్‌క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, కల్కి ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, ఎర్రం నారాయణ, ఎర్రం విజయ్ కుమార్, ఎర్రం వినోద్ పాల్గొన్నారు.