నిజాంసాగర్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు హనుమంతు షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం పత్తి క్వింటాలుకు రూ. 9609 పైచిలుకు ఉందని తెలిపారు.
రైతులు కష్టపడి పండిరచిన పంటను దళారుల వలలో పడకుండా నేరుగా మార్కెట్లో వచ్చి అమ్ముకోవాలని రైతులు లాభాల బాట పట్టాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ గంగాధర్, అశోక్ పటేల్, డోంగ్లి సర్పంచ్ శశాంక్ పటేల్, మద్నూర్ సర్పంచ్ సురేష్, పత్తి వ్యాపారస్తులు, రైతులు పాల్గొన్నారు.