కాల భైరవస్వామిని దర్శించుకున్న ఎంపి, ఎమ్మెల్యే

కామారెడ్డి, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి ఈసన్నపల్లి గ్రామాల్లోని కాల బైరవ స్వామి జన్మదిన వేడుకల్లో గురువారం ఎంపీ బిబిపాటిల్‌, ఎమ్మెల్యే సురేందర్‌ పాల్గొన్నారు. స్వామి వారి సన్నిధిలో అగ్గి గుండాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌ లావణ్య మల్లేశ్‌ ఇంటికి చేరుకుని గ్రామ సర్పంచ్‌కి, వారి పాలక వర్గానికి నూతన గ్రామ పంచాయితీ భవనానికి పది లక్షల రూపాయల ప్రొసీడిరగ్‌ కాపీని అందజేశారు, గ్రామంలోని మర్రి లత మహేష్‌కు సీఎం రిలీఫ్‌ ఫండు 44 వేల రూపాయలు చెక్కు అందజేశారు.

అనంతరం గ్రామంలో పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయితీ పాలకవర్గం పలు అభివృద్ధి పనుల గురించి విన్నవించారు. ఎమ్మెల్యే సురేందర్‌, ఎంపీ బిబిపాటిల్‌ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రామరెడ్డి మండల ఎంపీపీ దశరత్‌ రెడ్డి, రామరెడ్డి రైతు బంధు అధ్యక్షుడు నారాయణరెడ్డి, మండల వైస్‌ ఎంపీపీ రవీందర్‌ రావ్‌, గాంధారి ఏఎంసి చైర్మెన్‌ సత్యం రావ్‌, కపిల్‌ రెడ్డి, తెరాస సీనియర్‌ నాయకులు శ్రీను నాయక్‌, పోతునూరి ప్రసాద్‌, కాల బైరవ స్వామి ఆలయ మాజీ చైర్మన్‌ గంజి సతీశ్‌, రామరెడ్డి మండల పార్టీ ప్రసిడెంట్‌ రవీందర్‌ గౌడ్‌, రామరెడ్డి మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీలు, ఉపసర్పంచులు నర్సయ్య, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు, తెరాస అధ్యక్షుడు రెడ్డి మల్లేశ్‌, ఉపాధ్యక్షుడు కందురీ నరేష్‌, గ్రామ తెరాస నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »