గురుకులాల పనివేళల మార్పుపై సానుకూలంగా స్పందించిన మంత్రి

హైదరాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళలను ఇతర సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో సమానంగా ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 వరకు మార్చటానికి బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అంగీకరించారని టిఎస్‌ యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి గురువారం మంత్రిని మినిష్టర్‌ క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో కలిసి పనివేళల మార్పు, దసరా సెలవుల్లో అతిథి ఉపాధ్యాయుల (గెస్ట్‌ టీచర్ల) వేతనాల్లో కోతపై చర్చించారు. పాఠశాలల్లో పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉపాధ్యాయుల ఆందోళనను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అన్ని సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులకు ఒకే రకమైన సదుపాయాలు, ఉపాధ్యాయులకు ఒకే విధమైన వేతనాలు అమలు చేస్తున్నామని, పాఠశాలల పనివేళలు కూడా ఒకే విధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అతిథి ఉపాధ్యాయులు కూడా తెలంగాణ బిడ్డలే కనుక మానవతా దృక్పథంతో దసరా సెలవుల పేరిట కోత విధించిన వేతనం తిరిగి చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంజెపి టిబిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన బిసి సంక్షేమ శాఖా మంత్రి కమలాకర్‌కి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »