కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్మీ నగర్ తాండ, జంగంపల్లి గ్రామానికి చెందిన లంబాడి పరుశురాం విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందినందున మృతుడి భార్య సునీతకు ఐదు లక్షల నష్టపరిహార చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతులమీదుగా అందజేశారు. అదేవిధంగా భిక్కనూరు మండలం బసవపూర్ గ్రామానికి చెందిన వీరల్ల శేఖర్‌కు చెందిన పాడి గేదే విద్యుత్ ఘాతానికి గురై చనిపోయినందున అతడికి నష్టపరిహారం కింద 40 వేల రూపాయల చెక్కును అందజేశారు.
కార్యక్రమంలో జంగంపల్లి సర్పంచ్ నర్సింలు యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్, ఆర్బిఎస్ కన్వీనర్ శివలింగం, రాజంపేట విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్, భిక్కనూరు విండో చైర్మన్ గంగల భూమయ్య, విద్యుత్ ఏఈ రామలక్ష్మి, సబ్ ఇంజనీర్ శివతేజ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, బస్వాపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మల్లేష్ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ రామగల బిక్షపతి, తెరాస సీనియర్ నాయకులు చింతలూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.