ఆర్మూర్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలో తహశీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కం జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మార్వో దత్తాద్రి మాట్లాడుతూ నేటి నుండి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చెయ్యటం జరుగుతుందని, దీనికి తమ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్లో స్లాట్ బుక్ చేయించుకొని వచ్చినట్లయితే తాము వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని, భూములు కొన్న వారు అమ్మిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆలూర్ మండల ప్రజలు ఇపుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కొరకు, వ్యవసాయేతర భూమిగా నాల కన్వర్షన్ కొరకు ఆలూరు మండల రెవెన్యూ కార్యాలయానికి రావలసి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలూరు ఎమ్మార్వో దత్తాద్రి, ఎంపీపీ పస్కా నర్సయ్య, వైసీపీ భోజకాల చిన్నారెడ్డి, మాక్లూర్ ఎంపీపీ మస్త ప్రభాకర్, సొసైటీ చైర్మన్ కళ్లెం భోజరెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఆపరేటర్ సుదీర్, వెల్మ గంగారెడ్డి, మీరా గంగారం, గుండెమ్ తేజ, వీడీసీ సభ్యులు, సిపిఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు.