సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పియుసి చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సుర్బీర్యాల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎస్‌.సాయమ్మకు రూ. 16 వేలు, ఎం. రమేష్‌కు రూ. 15 వేలు, కె.రంజిత్‌కు రూ. 14 వేలు, వి. రాజు బాయికి రూ. 6 వేల 500 గ్రామ సర్పంచ్‌ సట్లపల్లి సవిత గణేష్‌, ఉప సర్పంచ్‌ మంచిర్యాల రాము, గ్రామ పంచాయతీ పాలకవర్గం, టిఆర్‌ఎస్‌ నాయకులు అశ్విన్‌ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేశారు.

అలాగే మహాత్మ గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలి ద్వారా గ్రామంలో 2022-23 సంవత్సరానికి గాను గ్రామంలో చేపట్టవలసిన పనులను గుర్తించుటకు గ్రామ సభను గ్రామ కార్యదర్శి డి. రవికుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సాయన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కారోబార్‌ యోగేష్‌, విఆర్‌ఏలు హారిక, వంశీ, ఆశ కార్యకర్తలు అరుణ, శోభ అంగన్‌వాడీ టీచర్‌ రాధిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »