కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూముల్లో మూడు తరాల నుంచి సాగులో ఉన్న వారిని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హత గల వారిని గుర్తించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
గ్రామ సభ ద్వారా అర్హత గల గిరిజనుల జాబితా చదివి ఎంపిక చేపట్టాలని సూచించారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. 2005 కన్నా ముందు సాగులో ఉన్న గిరిజనులను గుర్తించాలని పేర్కొన్నారు.
కొత్తగా అటవీ భూములు ఆక్రమిస్తే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జెడ్పి సీఈవో సాయాగౌడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, అటవీశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.