కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీలలో వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తక్షణమే దించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో రైస్ మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు.
ధాన్యాన్ని రైస్ మిల్లుల యజమానులు దించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయరాదని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, రైతు, బ్యాంకు వివరాలు ట్యాబ్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ పద్మ, రైస్ మిల్లు యజమానులు పాల్గొన్నారు.