కామారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్బంగా కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీలో స్వచ్చత రన్ నిర్వహించారు. గ్రామస్తులని భాగ స్వామ్యం చేసి టాయిలెట్ వాడకంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కల్పించారు.
గ్రామంలో ట్విన్ పిట్ టాయిలెట్ వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ట్విన్ పిట్ నిర్మాణంలో రెండు వేరు వేరు గుంతలు వుండడం వలన ఒక పిట్ నిండిన తర్వాత వేరొక పిట్‌లోకి జంక్షన్ బాక్స్ సహాయంతో వెళుతుందని తెలిపారు. రెండవ పిట్ నిండే లోపు మొదట నిండిన పిట్ ఎరువుగా తయారవుతుందని చెప్పారు. దానిని పంట పొలంలో ఎరువుగా వాడవచ్చునని వివరించారు.
తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ట్రాక్టర్‌లో వేయాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రత్నబాయి, పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఎంపివో మాలహరి, వార్డ్ మెంబెర్స్, ఏపిఎం శ్రీనివాస్, ఎస్‌బిఎం నారాయణ, మధు క్రిష్ణ, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి వినాయక్, జడ్పిహెచ్‌ఎస్ పిడి శివరాజు, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్, ఐకెపి విఓఎలు, విఓ అధ్యక్షులు, ఓబి లు, తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు, పోశెట్టి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.