బోధన్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం సమస్యలకు నిలయంగా మారిందని మహిళలు తెలిపారు. మహారాష్ట్ర ఇతర పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారులకు అడ్డగా ఉన్న రుద్రూర్ బస్టాండ్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని మహిళలు తెలిపారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో సమస్యలను, వివరాలను ప్రయాణికులను, సిబ్బందిని అడిగి మహిళలు తెలుసుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పరిస్థితి సక్రమంగా లేదని దాన్ని మెరుగుపరచాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యాలు ఇంకా పెంచాలని అన్నారు. బస్టాండ్ చుట్టుపక్కల ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు ఆవరించి ఉన్నాయని, క్రిమి కీటకాలు విష సర్పాల వల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉందని మహిళలు తెలిపారు.
బస్టాండ్‌కు ఎదురుగా సిసి ప్లాటు వెయ్యాలని సక్రమంగా లేకపోవడంతో కంకర తేలడంతో గుంతల మయంగా మారిందని, దీంతో ప్రయాణికులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బస్టాండ్లో తాగునీటి సౌకర్యం లేదని, తాగునీటి సౌకర్యం కల్పించాలని, టీవీ ఉన్నా పని చేయడం లేదని, ఫ్యాన్లు ఉన్నా తిరుగవని తెలిపారు.
బస్టాండ్‌కు సుమారు 5 వరకు సెట్టర్లు ఉన్న వాటి నుంచి ఆదాయం వచ్చినా బస్టాండ్‌లో సౌకర్యం మాత్రం సక్రంగా లేవని చెప్పారు. ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రయాణికులు ప్రజల కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని తెలిపారు. అనేక ఏళ్ల నుంచి బస్టాండ్ ప్రాంగణం సమస్యలకు నిలయంగా మారినా, సౌకర్యాలు లేకపోయినా నీటి సౌకర్యం లేకపోయినా సంబంధిత శాఖ అధికారులు, పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరమని ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టాలని మహిళలు తెలిపారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఏకమై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.