నిజామాబాద్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సద్గురు ఫౌండేషన్ తరపున ఢల్లీికి చెందిన జయసోలంకి, ప్రతీక్ యాదవ్ అనే ఇద్దరు యువకులు దేశ రాజధాని ఢల్లీి నుండి కోయంబత్తూరు వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు.
ఇందులో భాగంగా ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని నిజామాబాద్‌కు చేరుకున్న యువకులు శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజులను కలిశారు. ఎంతో మంచి ఉద్దేశ్యంతో ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులను కలెక్టర్, సీ.పీ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు అభినందించారు.