రెంజల్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రహిమాన్‌తో పాటు మధ్యాహ్న భోజనం ఇంచార్జ్ అరుణ్ అనే ఉపాధ్యాయుని సస్పెన్షన్ చేశారు. వివరాల్లోకెళ్తే శుక్రవారం నలుగురు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించడంతో వారిని నిజామబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం ఇద్దరిని డిస్‌చార్జి చేయగా మరో ఇద్దరు విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు ఎంఈఓ గణేష్ రావు తెలిపారు. సాధారణంగా మరో 20 మంది విద్యార్థులు పైగా అవస్థకు గురైనట్లు ఆయన తెలిపారు. ఇదే పాఠశాలలో గత రెండు నెలల క్రితం ఎంఈఓతో పాటు పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
16 మంది ఉపాధ్యాయులకు మెమోలు అందజేశారు, అప్పటి ఏజెన్సీని రద్దుచేసి నూతనంగా కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేశారు. శుక్రవారం భోజనంలో నాణ్యతతో కూడుకున్న భోజనం చేసినప్పటికీ కూడా ఇలా విద్యార్థులకు వికటించిందని గణేష్ రవు తెలిపారు. నిజామబాద్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలతో పాటు ఫుడ్ ఇన్ఫెక్షన్ సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షల అనంతరం వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు