ఎంపి అరవింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ పొలిటీషియన్‌ కాదు పొల్యూషన్‌ అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవింద్‌ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడు అని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఫైటర్స్‌ ఫ్యామిలీ అని, ధర్మపురి అరవింద్‌ది ఛీటర్స్‌ ఫ్యామిలీ అని ధ్వజమెత్తారు.

ఎంపీ అరవింద్‌ అబద్దానికి పుట్టిన అడ్డ గాడిద, బూతు పురాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, ఈ వెధవ నోరు తెరిస్తే సొల్లు పురాణం, అరవింద్‌ గాడొక దొంగ, డెకాయిట్‌, డ్రగ్‌ ఆడిక్ట్‌ డర్టీ ఫెల్లో, బడికిపోయే వయస్సులో బార్‌ షాపుల చుట్టూ తిరిగిన ఈ బట్టేబాజ్‌కు సంస్కారం ఎక్కడినుంచి వస్తుంది? అని ధర్మపురి కుటుంబమే ఒక అవినీతి కూపం అని, వాళ్ళు ధరించే దుస్తులు, తినే తిండి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని ద్వజమెత్తారు.

వాడొక ‘‘ఫేక్‌, ఫాల్స్‌, ఫ్రాడ్‌’’ ఎంపీ అని, అరవింద్‌ రాజస్థాన్‌లో చదువు ఒక ఫేక్‌ అని, పసుపు బోర్డ్‌ తెస్తానని రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ ఫాల్స్‌ అని, ఆయన చెప్పే మాటలు ఫ్రాడ్‌ అని, ‘‘బట్టేబాజ్‌, బద్మాష్‌, బడా జూటా ఎంపీ అని, వాగుబోతు, వదురుబోతు, తాగుబోతు అని, చదువు, సంజ్ఞ లేని సన్నాసి, సంస్కారం లేని బేవకూఫ్‌ అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై, మంత్రి కేటీఆర్‌ పై, ఎమ్మెల్సీ కవితపై అడ్డూ అదుపు లేకుండా ఆవాకులు చెవాకులు పేలుతుండని, అది మనిషి అనే వాడు ఉపయోగించే భాషేనా? కేటీఆర్‌, కవితను నేరుగా ఎదుర్కొనే దమ్ములేని అరవింద్‌ బూతు పురాణానికి దిగిండని అన్నారు.

పచ్చి అబద్ధాలతో బతుకుతున్న లంగ లపూట్‌, అరవింద్‌ ఒక పేకర్‌, అతడి అయ్య ఒక బ్రోకర్‌ అన్నారు. ఎంపీ నిజామాబాద్‌ జోకర్‌, అరవింద్‌ అయ్య ఫాదర్‌ ఆఫ్‌ కరెపక్షన్‌, వీడు ఫాదర్‌ ఆఫ్‌ లయ్యర్‌ అని ఎమ్మెల్యే అన్నారు. కవిత ఎప్పుడు ఎక్కడ మల్లి ఖార్జున ఖర్గేను కలిశారో నిరూపిస్తావా?, నీ మాటలు అబద్దాలకు పరాకాష్ట, లిక్కర్‌ స్కామ్‌ పేరుతో బీజేపీ టక్కరి గేమ్‌ ఆడుతూ కవితను బ్లేమ్‌ చేసే కుట్రలు సాగిస్తున్నదని, ఇప్పుడు కవిత ఖర్గేతో మాట్లాడారని అభూత కల్పనతో బీజేపీ బ్రోకర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

అరవింద్‌ గాడి తప్పుడు మాటలకు చెప్పులతో కొట్టడం చిన్న మాట అని, కవిత వ్యక్తిత్వం ఉన్న ఆడబిడ్డ కాబట్టి చెప్పుతో సరి పెట్టారు, మేమైతే ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో అరవింద్‌ బట్టలూడదీసి ఉరికిచ్చి కొడతాం అన్నారు. అరవింద్‌ ఎంపీగా ఈ నాలుగేళ్లలో ఏం చేసాడో, ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని, మేము కట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో, మిషన్‌ భగీరథ పథకంలో, మేమిస్తున్న పెన్షన్లు, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాలో కేంద్రానివి ఎన్ని నిధులున్నాయో చెప్పాలని, పసుపుబోర్డు తేనందుకు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు.

సరుకులేని సన్నాసులే మతాన్ని, కులాలను వాడుకుంటారని, తెలంగాణలో మతాల మంట పెట్టాలని బీజేపీ చూస్తున్నదని, కొత్తగా అరవింద్‌ కులాల కుంపటి రగిలించాలని కుట్ర చేస్తుంని, బీజేపీ నయా కుట్రలో భాగమే కేసీఆర్‌ కుటుంబానిది కుల దురాహంకారం అని అరవింద్‌ అంటుండన్నారు. కేసీఆర్‌ కుటుంబానిది కుల దురహంకారం కాదు. సకల కులాల సమ్మేళనం. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ కుటుంబమే, కేసీఆర్‌ ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోము, అరవింద్‌ను ఏ గ్రామానికీ రానివ్వం అని చెప్పారు.

ఎక్కడ కనపడితే అక్కడ దంచుడే, నీ చిల్లర స్థాయికి కవితతో పోటీయా?, నీకు నేను చాలు, నీకు దమ్ముంటే ఆర్మూర్‌లో నామీద పోటీ చేయి, నువ్వు ఎప్పుడు పోటీ చేస్తావా, మెత్తగా తన్ని తరీమేద్దామని, నిన్ను పండబెట్టి తొక్కుదామని ఆర్మూర్‌ జనం నీకోసం వెయిట్‌ చేస్తుండ్రు, బండి సంజయ్‌, అరవింద్‌లకు హెయిరే కాదు బ్రెయిన్‌ కూడా లేదన్నారు.

అరవింద్‌ ఏదో పెద్ద పహిల్వాన్‌ అయినట్టు, ఏదో దాడి జరిగిందని రాష్ట్ర స్థాయి నిరసనలకు పిలుపునిచ్చిన బండి సంజయ్‌కు అసలు దిమాక్‌ ఉందా?, అరగుండు అరవింద్‌, బండి సంజయ్‌ లిద్దరూ బ్రెయిన్‌ లేని మెంటల్‌ గాళ్ళు, ఇద్దరినీ ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రిలో చేర్చాలి అని జీవన్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలకు బంధాలు, బంధుత్వాలు లేవు అని, కుటుంబ విలువలు తెలియదు అని, నైతికత లేదని, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, ఐటీ, సీబీఐ, ఈడీలు మోడీకి అల్లుళ్లు, జై మోడీ అంటే నై ఈడీ, లేకుంటే విచారణల పేరుతో వేధింపులు, పచ్చని కాపురాలలో బీజేపీ చిచ్చు పెడుతుందన్నారు.

కోమటిరెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టి ఒకే ఇంట్లో రెండు పొయ్యిలు రాజేసింది ఆయన మండిపడ్డారు. తమిళ సై గవర్నర్‌గా కాకుండా బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులా వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్‌ భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని, టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లపై బీజేపీ గూండాలు దాడి చేయలేదా?, అప్పుడు గవర్నర్‌ ఎందుకు స్పందించలేదు?, అరవింద్‌ ఇంటిపై దాడి జరిగిందో లేదో దాడిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కోరారు. గతంలో జరిగిన దాడులపై కూడా నివేదికలు కోరి ఉంటే ఆమెకు నిజాయితీ ఉందని భావించే వాళ్ళం, గత ఆగస్టులో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ అరాచక మూకలు దాడి చేశాయి. గత జులైలో వరంగల్‌లో టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ఇంటిపై బీజేపీ గూండాలు రాళ్లతో దాడి చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ రౌడీ మూకలు పలివెల గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యాకర్తలపై రాళ్లు, కత్తులు, కటార్లతో దాడి చేసి గాయపరిచారు. మా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని కొట్టి గాయాలపాలు చేశారు. మరి ఈ ఘటనలపై గవర్నర్‌ ఎందుకు నివేదికలు కోరలేదు? అంటే గవర్నర్‌కు సమ న్యాయం పట్టదా? బీజేపీకి ఒక న్యాయం, టీఆర్‌ఎస్‌లు మరో న్యాయమా? గవర్నర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదని, మోడీ-షాల కమల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని జీవన్‌ రెడ్డి మండిపడ్డారు.

విలేకరుల సమావేశంలో పలువురు టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »