కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట, చిన్న మల్లారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు.
ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న మల్లారెడ్డిలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించారు. మిల్లింగును వేగవంతం చేయాలని రైస్ మిల్ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో రాజంపేట సహకార సంఘం చైర్మన్ నల్లవెల్లి అశోక్, డిప్యూటీ ఎమ్మార్వో కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు.