కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్‌లో మంగళవారం పోస్ట్ ఆఫీస్ అధికారి వెంకట్రాంరెడ్డి స్థానిక పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించారు. అనంతరం ప్రజలకు తపాలా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పోస్ట్ ఆఫీస్ ద్వారా కలిగే లాభాలను వివరించారు. చిన్నపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బిపిఎం షకీర్, ఏబీపీఎం బాలరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.