కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. లింగంపేట, శెట్టిపల్లి సంగారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. లింగంపేటలోని సాయి కృష్ణ, ఉమామహేశ్వర రైస్ మిల్లులను సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా రోజువారిగా మిల్లింగ్ పూర్తి చేయాలని రైస్ మిల్ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారిని వసంత, జిల్లా పౌర సరఫరాల అధికారిని పద్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.