డిచ్పల్లి, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం విభాగం అధ్వర్యంలో నవంబర్ 29, 30వ తేదీలలో ‘‘బయో ఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ (బిఎంసి-2022) ‘‘ విషయం పై నిర్వహించబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రౌచర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందరన గుప్త ఆవిష్కరించారు.
సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలయాలకు సంబంధించిన ప్రోఫెసర్లు, విద్యావేత్తలు హాజరు అవుతారని, సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. జి. బాలకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో రిజిష్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని, డా. నాగరాజు, డా. సాయిలు, డా. ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.