కామారెడ్డి, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత కార్డుల కోసం అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు బుధవారం ఆయన ఆహార భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు పర్యవేక్షణ చేసి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్ డిఓ సాయన్న, జిల్లా విద్యాశాఖ, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.