కామారెడ్డి, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం బాగయ్య మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తి స్థాయిలో యువకులతో గ్రామ మండల కమిటీలను నిర్మాణం చేసి జిల్లా కమిటీని ప్రకటిస్తామని, జనవరి 6 న బెంగుళూరులో ఎం.ఆర్.పి.ఎస్ జాతీయ మహాసభ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావడానికి ఎం.ఆర్.పి.ఎస్ సంస్థాగత నిర్మాణం చేపట్టి మాదిగ యువకులకు ఉద్యమంలో కీలక భాగస్వాములు చేస్తున్నామన్నారు.
అందులో భాగంగానే నూతన గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవి పూర్తయిన తరువాత కామారెడ్డి జిల్లాకు పూర్తి స్థాయి ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా కమిటీని ఎంపిక చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మాదిగలు రాజీలేని పోరాటం చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కేంద్రంలో బీజేపీ మెడలు వంచడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు.
అందులో భాగంగా జనవరి 6 న బెంగుళూరులో ఎం.ఆర్.పి.ఎస్ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నామని మాదిగ యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యం.ఎస్.పి నాయకులు పురుషోత్తం, బాగయ్య, రాజయ్య, మురళి గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మాదిగ మహిళ సమాఖ్య నాయకురాలు లక్ష్మీ మాదిగ, జుకంట్టి రాజలక్ష్మి, రంగాల్ల శివాని, కర్రల్లో మంజుల తదితరులు పాల్గొన్నారు.