కామరెడ్డి, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఆయన పాఠశాలలకు, వసతి గృహాలకు అందించే ఆహారంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు పర్యవేక్షణ చేసి అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్ డిఓ సాయన్న, జిల్లా విద్యాశాఖ, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.