ఆర్మూర్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారిణి వై.సురేఖ బుధవారం తెలిపారు.
150 సంవత్సరాల చరిత్ర కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సేవలను విస్తరిస్తోందని, బట్వాడి నుండి మొదలుకొని డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోందని, ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తపాల శాఖ ద్వారా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం, రికరింగ్ డిపాజిట్, ఇన్సూరెన్స్, ఐపిపిబి బ్యాంకు సేవలు, ఆధార్ సర్విసెస్, డిజిటల్ చెల్లింపులు, యాక్సిడెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలు అన్నీ పోస్టాఫీలలో అందుబాటులో ఉన్నాయని, ఇట్టి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.