నిజాంసాగర్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. పిట్లం మండలం తిమ్మా నగర్, రాంపూర్, నిజాంసాగర్ మండలం అచ్చంపేట, మాగి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. మిల్లర్ల నుంచి ట్రక్ షీట్ వచ్చిన వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా చేపట్టాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించే విధంగా అధికారులు చూడాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్షేత్రస్థాయిలో కొనుగోలు జరగాలని పేర్కొన్నారు. పిట్లంలోని సంగమేశ్వర రైస్ మిల్లు సందర్శించారు. మిల్లింగ్ వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.