కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ఏరియా వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న విజయ (25) నేరెల్ తాండాకి చెందిన గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా లిరెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని రక్తదానానికి యువతి యువకులు ముందుకు రావాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, 15 రోజులకోసారి ప్లేట్ లెట్స్‌ను దానం చేసి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత మందుల సంతోష్‌కి కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది చందన్, యేసు గౌడ్ పాల్గొన్నారు.