కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ రంగంలో జెడ్ సర్టిఫికెట్ కొత్త ఉత్పత్తుల ప్రక్రియ మార్కెటింగ్ విస్తరించేందుకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఏంఎస్‌ఎంఈ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీస్ బాల్ నగర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గురువారం జీరో డిఫెక్ట్, జీరో ఈఎఫ్ ఫెక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే విధంగా జెడ్ ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపారు. జెడ్ కోఆర్డినేటర్ నవీన్ కుమార్ జెడ్ సర్టిఫికెట్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రో గ్రామ్ కోఆర్డినేటర్ రాజేష్ కుమార్ యాదవ్ ఎమ్మెస్ ఎంఈ పథకాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ చిందం రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి లాలూ నాయక్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, కంటెంట్ ఫ్యాకల్టీ కే. నవీన్, ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.