కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 2022-23 సెప్టెంబర్ అర్ధ సంవత్సర బ్యాంకుల రుణ వితరణ, పనితీరు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
2022-23 లో నిర్దేశించుకున్న వార్షిక సంవత్సరంలో రూ.4700 కోట్లు, అర్థ సంవత్సరానికి రూ.1714 కోట్లు (36.47 శాతం), ప్రాధాన్యతరంగానికి రూ.325 కోట్లు (31 శాతం) రుణ వితరణ చేసినట్లు తెలిపారు.
జిల్లాలో పాడి, మత్స్య పరిశ్రమలకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి మహమ్మద్ అలీ, కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ జి. శ్రీనివాసరావు, నాబార్డ్ డిజిఎం నగేష్, ఎల్డిఎం చిందం రమేష్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా పశు వైద్యాధికారి భరత్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.