కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి శివారులో గల ఈద్గా పనులను 35, 12వ వార్డ్ కౌన్సిలర్లు ప్రారంభించారు. ఈద్గా నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శివారులో ఈద్గా నిర్మాణ పనులను 12, 35 వార్డ్ కౌన్సిలర్‌లు కృష్ణజీ రావు, స్వామి ప్రారంభించారు. ఇందులో భాగంగా మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈద్గా నిర్మాణానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 3 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు.
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సహకరించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.కె. ముజిబొద్దిన్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావులకు వార్డ్ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మైనారిటీలు వార్డ్ కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నిట్టు లింగారావు, మహమ్మద్ సాజిద్, రియాజ్, ఇలియాస్ ఖాన్, బాబా తదితరులు పాల్గొన్నారు.