నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టివియువి) ఆధ్వర్యంలో గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో విద్యార్ధులపై ఫీజుల భారాన్ని తగ్గించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ రాంమోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్ రామావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం బి.ఎ, బికాం, బియస్.సిలో నూతన కాంబినేషన్ కోర్సులు ప్రవేశపెట్టిందని, విద్యార్థులకు ఫీ-రియంబర్స్ మెంట్ తక్కువ విడుదల చేయడంతో రాని రియంబర్స్ మెంట్ మొత్తాన్ని కళాశాల ఫీజు రూపంలో చెల్లించాలని చెప్పడంతో విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు పెను భారంగా మారుతున్నాయని అన్నారు.
ప్రభుత్వ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి విడుదలకాని రియంబర్స్ మెంట్ మొత్తాన్ని చర్చించి ప్రభుత్వం స్కాలర్ షిప్ రూపంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థుల ఫీజులు పెను భారం పేరీట ఉద్యమం ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టివియువి జిల్లా ఇంఛార్జి నవీన్, అజయ్, ఆకాష్, మణించంద్, తుకారాం, సందీప్ తదితరులు పాల్గొన్నారు.