టీఆర్‌ఎస్‌లో చేరిన మైనారిటీ నేతలు

ఆర్మూర్‌, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు షేక్‌ ఖలీం అహ్మద్‌ నాయకత్వంలో వందలాది మంది టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి జీవన్‌ రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌ లోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మైనారిటీ నేతలు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులమై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరిన మైనారిటీ నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలోని మైనార్టీలకు తాను అన్ని రకాలుగా అండగా నిలుస్తానని జీవన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు ఎర్రం యమునా ముత్యం, ఎంపిపి అధ్యక్షుడు వాకిడి సంతోష్‌ రెడ్డి, ఎంపిపి ఉపాధ్యక్షుడు దేవేందర్‌, ఉప సర్పంచ్‌ కొత్తూర్‌ భరత్‌, ఎంపిటీసి సభ్యుడు బజ్జూ, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్‌, కో-ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ ఉస్సేన్‌, రఫీక్‌, సుధాకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »