రెంజల్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సర్పంచ్ వికార్ పాషా చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ 14 వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారుడు గంగాధర్‌కు అందజేసినట్లు సర్పంచ్ అన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్, రాజశేఖర్, గంగాధర్, నితిన్, తదితరులు పాల్గొన్నారు.